నాడు భార్యలు.. నేడు భర్తలు
చెన్నూర్‌రూరల్: మండలంలోని నాగాపూర్, లింగంపల్లి గ్రామాల్లో 2019లో భార్యలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సర్పంచుల రిజర్వేషన్ కలిసి రావడంతో భర్తలు పోటీ చేసి గెలుపొందారు. నాగాపూర్‌లో 2019లో బీసీ మహిళకు రిజర్వ్ రావడంతో అన్నల మానస బీఆర్‌ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచారు. ఈసారి జనరల్ రిజర్వ్ కావడంతో ఆమె భర్త అన్నల తిరుపతి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. లింగంపల్లిలో 2019లో బీసీ మహిళకు రిజర్వ్ రావడంతో అంగ లక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో సర్పంచుగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం బీసీ జనరల్ రిజర్వ్ కావడంతో ఆమె భర్త అంగ రమేష్ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచు గెలిచారు.
నాడు భార్యలు.. నేడు భర్తలు
నాడు భార్యలు.. నేడు భర్తలు


