నిర్లక్ష్యం వహిస్తున్నారు..
ప్రతీసారి రిటైర్డ్ ఉద్యోగులకు లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. ఆన్‌రోల్ కార్మికులకు చెల్లించేటప్పుడే రిటైర్డ్ ఉద్యోగులకూ కూడా చెల్లించాల్సి ఉండగా కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రిటైర్డ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి,
టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి
కార్యాలయాల
చుట్టూ తిరుగుతున్నాం
బోనస్ డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. ప్రతీసారి బోనస్ చెల్లింపుల్లో రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సింగిల్ క్లిక్‌తో కంప్యూటర్‌లో ఉద్యోగుల సమస్త వివరాలు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా నెలల తరబడి లెక్కలు చేయడం విడ్డూరంగా ఉంది. సత్వరమే రిటైర్డ్ ఉద్యోగులకు బోనస్ చెల్లించాలి.
– ఏ.వేణుమాధవ్,
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
నిర్లక్ష్యం వహిస్తున్నారు..


