విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి
కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన కై పెల్లి ప్రణీత్ విద్యుత్‌షాక్‌తో బుధవారం మరణించాడు. అయ్యప్ప దీక్షలో ఉన్న ప్రణీత్ బుధవారం వేకువజామునే పూజ చేశాడు. అనంతరం మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టడానికి పొలం వద్దకు వెళ్లాడు. మోటారు స్టార్ట్‌చేసే క్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై మృతిచెందాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రణీత్‌కు తల్లి, సోదరుడు ఉన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


