పరదాల చాటున పోలింగ్!
నిర్మల్ జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రాథమిక పాఠశాలల్లో గదులు తక్కువగా ఉండడంతో పాఠశాలల ఆవరణలోనే పరదాలు కట్టి బూత్‌లు ఏర్పాటు చేశారు. ముధోల్ నియోజకవర్గంలోని భైంసా, బాసర, కుభీర్ మండలాల్లో చాలా పాఠశాలల ఆవరణలో ఇలా పరదాల చాటునే పోలింగ్ నిర్వహించారు. ఇలేగాం, కుంసర గ్రామాల్లోనూ పరదాలతోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో గదులు ఉన్నా.. పరదా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్
పరదాల చాటున పోలింగ్!


