పతుల్.. సతుల్.. సర్పంచ్
లోకేశ్వరం:పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాకు చెందిన కొన్ని గ్రామాల ప్రజలు భిన్నమైన, విచిత్రమైన తీర్పు ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిపించిన కుటుంబానికే మరో అవకాశం ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో పతిని గెలిపిస్తే.. ఈ ఎన్నికల్లో సతులను గెలిపించారు. లోకేశ్వరం మండలం రాజూర, పుస్పూర్, లోకేశ్వరం పంచాయతీ ఓటర్లు 2019, 2025 ఒకే కుటుంబాలకు చెందిన భార్య, భర్తలు పంచాయతీ పగ్గాలు అపపగించారు. 2019 ఎన్నికల్లో రాజూర సర్పంచ్‌గా ముత్తగౌడ్ ఎన్నిక కాగా, 2025 ఎన్నికల్లో ఆయన భార్య శ్యామలను గెలిపించారు. ఇక పుస్పూర్ సర్పంచ్‌గా 2019లో సంగెం నర్సన్నను ఎన్నుకోగా ప్రస్తుతం ఆయన భార్య సంగెం లక్ష్మిని గెలిపించారు. లోకేశ్వరం ఓటర్లు 2019లో తమ సర్పంచ్‌గా దార్వాడి సౌజన్యను ఎన్నుకున్నారు. 2025 ఎన్నికల్లో ఆమె భర్త దార్వాడి కపిల్‌కు పగ్గాలు అప్పగించారు.
పతుల్.. సతుల్.. సర్పంచ్
పతుల్.. సతుల్.. సర్పంచ్
పతుల్.. సతుల్.. సర్పంచ్
పతుల్.. సతుల్.. సర్పంచ్
పతుల్.. సతుల్.. సర్పంచ్


