సిరా గుర్తు తొలిగిస్తున్న వ్యక్తి పట్టివేత
ముధోల్ : మూడో వి డత పంచాయతీ ఎ న్నికల సందర్భ ంగా నిర్మల్ జిల్లా ముధోల్ ప్రభుత్వ పాఠశాల కేంద్రంలో ఓటు వేసి బ యటకు వచ్చిన ఓ మహిళ వేలికి పెట్టి న సిరా గుర్తును తొలగిస్తూ ఓ వ్యక్తి పట్టుపడ్డాడు. మండల కేంద్రం నయాబాదికి చెందిన ఆర్బాజుద్దీన్ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన మహిళ వేలికి పెట్టిన సిరా చుక్కను కెమికల్‌తో తొలగిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్బాజుద్దీన్‌ను అ దుపులోకి తీసుకుని కెమికల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. దొంగ ఓట్లు వేయించేందుకు సిరా గుర్తు తొలగించేందుకు ప్రయత్నించి ఉండవచ్చుని పోలీసులు భావిస్తున్నారు.
డీసీసీ సొంత ఊరిలో బీఆర్‌ఎస్ విజయం
గుడిహత్నూర్: డీసీసీ అఽ ద్యక్షుడు నరేశ్ జాదవ్ సొం త ఊరు తోషంతండాలో బీఆర్‌ఎస్ మద్దతు అభ్యర్థి జాదవ్ జితేందర్ 294 ఓట్లు సాధించి 68 ఓట్ల మెజారిటీతో విజ యం సాధించాడు. కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన జాదవ్ శ్రీకాంత్ 226 ఓట్లు సాధించి పరాజయం పాలయ్యాడు. జాదవ్ నరేశ్ ఉదయం తన సొంతూరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సిరా గుర్తు తొలిగిస్తున్న వ్యక్తి పట్టివేత


