విద్యుత్ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ వినియోగదారుల సమస్యలపై నిర్లక్ష్యం, ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని ఎన్పీడీసీఎల్ సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టౌన్–2 సర్కిల్ కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అధిక బిల్లు, లో ఓల్టేజీ, కొత్త కనెక్షన్ తదితర సమస్యలపై వినియోగదారులు ఫి ర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ నారాయణ మాట్లాడుతూ రైతులు, సాధారణ విని యోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. ఆలస్యంగా వచ్చిన డీఈ(టెక్నికల్) మల్లేష్‌ను ప్రశ్నించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది పనితీరు మారాలని మందలించారు. సీజీఆర్‌ఎఫ్ టెక్నికల్ మెంబర్ సలంద రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ శేర్ల సత్యనారాయణ, ఫోర్త్ మెంబర్ మర్రిపెల్లి రాజగౌడ్, ఎస్‌ఈ రాజన్న, డీఈ ఖైజర్, ఎస్‌ఏవో రాజేశం పాల్గొన్నారు.


