టీచర్ డిప్యూటేషన్ రద్దు
భీమారం: ఉపాధ్యాయురాలి డిప్యూటేషన్ రద్దు చేయాలన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనపై అధికారులు స్పందించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన టీచర్ ప్రమీలను రెడ్డిపల్లి పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించడం, మంగళవారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడం తెలిసిందే. దీంతో డిప్యూటేషన్ రద్దు చేస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారని విద్యాశాఖ జిల్లా సెక్టోరియల్ అధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన పాఠశాలను సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు.


