మొదటి ఫలితం ఇక్కడే.. | - | Sakshi
Sakshi News home page

మొదటి ఫలితం ఇక్కడే..

Dec 11 2025 9:27 AM | Updated on Dec 11 2025 9:27 AM

మొదటి

మొదటి ఫలితం ఇక్కడే..

గ్రామ పంచాయతీ ఎన్నికలకు

సర్వం సిద్ధం

మొదటి విడతలో నాలుగు మండలాలు

సిబ్బందికి సామగ్రి పంపిణీ

81 సర్పంచ్‌, 514 వార్డులకు పోలింగ్‌

బందోబస్తు విధుల్లో 996 మంది పోలీసులు

ఉదయం పోలింగ్‌.. మధ్యాహ్నం తర్వాత ఫలితాల వెల్లడి

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జిల్లాలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంచిర్యాల రెవెన్యూ డివిజన్‌లోని దండేపల్లి, హాజీపూర్‌, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లో పోలింగ్‌ జరగనుంది. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముగుస్తుంది. భోజన విరామం అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. పోలింగ్‌ నిర్వహణకు గాను బుధవారం హాజీపూర్‌ ఎంపీపీ కార్యాలయం, లక్సెట్టిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, జన్నారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎన్నికల ఉత్తర్వుల కాపీలతోపాటు బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రిని అందజేయగా సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. అక్కడ పోలింగ్‌ నిర్వహణ ఏర్పాట్లు చేసుకున్నారు. హాజీపూర్‌, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో90 గ్రామ పంచాయతీలకు గాను ఆరు ఏకగ్రీవం కాగా, మరో మూడు పంచాయతీల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. మిగతా 81 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనుండగా.. 258 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 81 పంచాయతీల్లోని 816 వార్డు సభ్యుల స్థానాలకు గాను 34 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 268మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. మిగతా 514 వార్డుల్లో 1,476 మంది పోటీ పడుతున్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 1,28,694 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

అధికారులు సిద్ధం

తొలి విడత ఎన్నికల్లో 829 మంది ప్రిసైడింగ్‌ అధికారులు(పీఓ), 1,071 మంది ఇతర పోలింగ్‌ అధికారులు(ఓపీఓ) పాల్గొంటున్నారు. 35మంది స్టేజ్‌–2 ఆర్‌వోలతోపాటు 20 మంది మైక్రో అబ్జర్వర్లు, 26మంది వెబ్‌కాస్టింగ్‌ సిబ్బంది ఎన్నికల్లో భాగస్వామ్యం కానున్నారు. ఎన్నికల సిబ్బంది తరలింపునకు 53 బస్సులు, 17కార్లు, తొమ్మిది టాటా ఏస్‌ వాహనాలను డీటీవో గోపికృష్ణ ఆధ్వర్యంలో ఎంవీఐ సంతోష్‌కుమార్‌, సిబ్బంది ఏర్పాటు చేశారు.

శాంతియుతంగా ఎన్నికలు

శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. అతి సున్నితమైన, సున్నితమైన గ్రామాలతోపాటు పోలింగ్‌ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎలాంటి వివాదా లు, గొడవలు జరిగినా వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలని అన్నారు. 20 రూట్లలో 996మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. నలు గురు ఏసీపీలు, సీఐలు 12 మంది, ఎస్సైలు 30 మంది, 950 మంది ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఆర్మ్‌డ్‌, ఏఆర్‌ పోలీసులు విధుల్లో పాల్గొంటారని తెలిపారు.

400లోపు ఓటర్లు ఉన్న గ్రామాలు...

జన్నారం: పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రంలో సిబ్బంది

లక్సెట్టిపేట: బ్యాలెట్‌ బాక్సులతో కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది

తక్కువ ఓట్లు ఉన్న పంచాయతీల్లో ఫలితాలు వేగంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. పలు గ్రామాల్లో 300లోపే ఓటర్లు ఉన్నారు.

దండేపల్లి మండలం బుద్దారంలో 271మంది, హాజీపూర్‌ మండలం నాగారంలో 228 మంది, జన్నారం మండలం సింగరాయిపేటలో 281మంది, నీలాయిపల్లెలో 292మంది, రాజారంలో 266 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలు గంటలో వెలువడే అవకాశాలు ఉన్నాయి.

దండేపల్లి మండలం అక్కలపల్లిలో 357మంది, లక్ష్మీపూర్‌లో 378మంది, చాకెపల్లిలో 364మంది, రాచపల్లిలో 373మంది, చెలకగూడలో 339మంది, జన్నారం మండలం రొట్టెపల్లిలో 323మంది, బొప్పారంలో 371మంది, మెట్‌పల్లిలో 387మంది, కల్లంపల్లిలో 319 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా సర్పంచ్‌ ఎన్నికల ఫలితలు త్వరగానే వెలువడనున్నాయి.

దండేపల్లి: మాట్లాడుతున్న మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

మొదటి ఫలితం ఇక్కడే.. 1
1/4

మొదటి ఫలితం ఇక్కడే..

మొదటి ఫలితం ఇక్కడే.. 2
2/4

మొదటి ఫలితం ఇక్కడే..

మొదటి ఫలితం ఇక్కడే.. 3
3/4

మొదటి ఫలితం ఇక్కడే..

మొదటి ఫలితం ఇక్కడే.. 4
4/4

మొదటి ఫలితం ఇక్కడే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement