గోదావరినదికి మహాహారతి
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్ గోదావరి నది పుష్కరఘాట్ వద్ద కార్తికమాస మాస శివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గోదావరి నది వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాన్ని నివేదించారు. మంత్రోచ్ఛారణల మధ్య గోదారమ్మకు హారతి ఇచ్చి లోకం సుభి క్షంగా ఉండాలని పూజించారు. కార్యక్రమంలో గో దావరి కన్వీనర్ జీవీ ఆనంద్‌రావు, అధ్యక్షుడు ప్రతా ప్, ప్రధాన కార్యదర్శి మహేశ్, లలితా సేవా సమితి సభ్యుడు విశ్వేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.


