 
															వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఖానాపూర్: తెలంగాణ గోసేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన పరీక్ష పోటీల్లో మండలంలోని మస్కాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు హెచ్‌ఎం నరేందర్ రావు తెలిపారు. బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థిని నవ్య, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థి అభినయ్, నాలుగో స్థానంలో నిలిచిన విద్యార్థిని సంజన, ఐదో స్థానంలో రాణించిన విద్యార్థిని దీప్తిలను అభినందించారు. ఈనెల 26న హైదరాబాద్‌లోని కేశవ నిలయంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. పోటీల్లో మొదటిస్థానంలో రాణించిన వారికి రాష్ట్ర గవర్నర్ అవార్డుతో పాటు రూ.లక్ష నగదు బహుమతి ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులు శంకర్, శేఖర్, శ్రీనివాస్, అంజయ్య, ఇమ్రాన్, కిషన్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
