
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● డెప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్
వేమనపల్లి: విధుల్లో నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని డెప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్ అన్నారు. పీహెచ్‌సీలో ప్రసవ వేదన శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి కృపబాయితో కలిసి పీహెచ్‌సీలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రసూతి కోసం కొండగొర్ల సోనియా పీహెచ్‌సీకి వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటివి పునరావృతమైతే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. లోతట్టు గ్రామాల్లోని గర్భిణులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అత్యవసర వేళ 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట జిల్లా కమ్యూనిటీ అధికారి వెంకటేశ్వర్, బీపీహెచ్‌ఎన్ ఆర్‌ఎస్ పద్మ, ఎస్‌యూఓలు జగదీశ్, వసంత, సూపర్‌వైజర్ అపరంజి, రాంశెట్టి బాపు ఉన్నారు.
ఎఫెక్ట్..

విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు