
ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కృషి
● సింగరేణి సీఎంవో కిరణ్ రాజ్‌కుమార్
శ్రీరాంపూర్: సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన నస్పూర్ కాలనీ, ఆర్కే 8 కాలనీల్లోని సింగరేణి డిస్పెన్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీ ఆస్పత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, అవసరమైన మందులు సమకూర్చుతున్నామని తెలిపా రు. ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిజియోథెరపీ విభాగం ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆడియో మెట్రి తీరును జీఎం పరీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్‌ఓటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, డీవైజీఎంఓ రమేశ్‌బాబు, ఏఐటీయూసీ నాయకులు వీరభద్రయ్య, బద్రి బుచ్చయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సీఎంఓకు వినతులు
సింగరేణిలో వైద్య విభాగం సమస్యలపై యూనియన్ నేతలు సీఎంఓ డాక్టర్ కిరణ్‌రాజ్ కుమార్‌కు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ నాయకులు వేర్వేరుగా వినతిపత్రం సమర్పించారు. ఆర్కే 8 డిస్పెన్సరీని 50 బెడ్‌ల ఆసుపత్రిగా మార్చాలని, సీటీ స్కాన్, 2డీ ఎకో అందుబాబులో ఉంచాలని పేర్కొన్నారు. సత్వరమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీరాంపూర్‌లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపర్చాలని, నస్పూర్ డిస్పెన్సరీలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు పొగాకు రమేశ్, అన్వేశ్‌రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి షేక్ బాజీసైదా, జీఎం కమిటీ చర్చల ప్రతినిధి బధ్రి బుచ్చయ్య, నాయకులు మూడ సుధాకర్, విజయలక్ష్మీ, అఫ్రోజ్‌ఖాన్ పాల్గొన్నారు.