
ట్రిపుల్‌ఐటీలో ముగిసిన కౌన్సెలింగ్
భైంసా: ట్రిపుల్‌ఐటీ బాసర, మహబూబ్‌నగర్ సెంటర్లకు 2025 –26 విద్యా సంవత్సరానికి గాను తొలివిడత కౌన్సెలింగ్ బుధవారం ముగిసింది. మూడవ రోజు ట్రిపుల్‌ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్‌లు కౌన్సెలింగ్ ప్రారంభించారు. రెండు సెంటర్లలో కలిపి 1690 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మూడు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 1472 మంది విద్యార్థులు హాజరయ్యారు. గైర్హాజరైన విద్యార్థుల స్థానాలను త్వరలోనే వెయిటింగ్ లిస్టు ఆధారంగా భర్తీ చేస్తామని క్యాంపస్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ బాసర క్యాంపస్ పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు.