
‘పేదల గుండెల్లో నిలిచిన నేత వైఎస్సార్’
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల గుండెల్లో నిలిచిన మహానేత అని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రా వు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివా సంలో మంగళవారం డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరా ల సురేఖతో కలిసి వైఎస్సార్ జయంతి నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల కు అండగా నిలిచారని తెలిపారు. తనకు వైఎస్సార్ అత్యంత సన్నిహితులని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. తాజా మాజీ ప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.