
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
జైపూర్: మహిళలలు ఆర్థికంగా ఎదగాలని సె ర్ప్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంజయ్య సూ చించారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ తేడాది ప్రగతి నివేదికలు, ఈ ఏడాది చేపట్టను న్న ప్రణాళికలను మండల సమాఖ్యలో ఏపీఎం రాజ్‌కుమార్ వివరించారు. వారు మాట్లాడు తూ.. సీ్త్రనిధి రుణాలు, ఆర్థిక అక్షరాస్యత, మ హిళల జీవిత బీమా, పౌల్ట్రీ యూనిట్, డెయిరీ పార్లర్, స్కూల్ యూనిఫాంలు, వడ్డీ లేని రు ణాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ పనులు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఆర్టీసీ బస్సులు, మినీ గోదాంలు, పెట్రోల్ బంక్, మహిళా క్యాంటీన్, మహిళా శక్తిబజార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మహిళలను సన్మానించారు.