
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మందమర్రిరూరల్: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శనివారం జీఎం కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జీఎం దేవేందర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమ య్య, సెంట్రల్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ కాంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ కేకే ఓసీలో విధులు నిర్వహించే క్వార్టర్‌లేని కార్మికులకు 9 శాతం ఇంటి అద్దె చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు ప్లేడేలు వర్తింప జేయాలని, క్యాంటీన్లలో భోజన సౌకర్యం కల్పించాలని, ఎస్‌అండ్‌పీసీ సిబ్బందికి నాణ్యమైన యూనిఫాంతో పాటు రెయిన్‌కోట్స్ ఇవ్వాలని, కేకే–6 గని, శ్రావన్‌పల్లి గనులను త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు.