
అతివలకు అండగా ‘సీ్త్రనిధి’
పాతమంచిర్యాల: మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు గ్రామీణాభివృద్ధి శాఖ సీ్త్రనిధి ద్వారా రు ణాలు మంజూరు చేస్తోంది. 11శాతం వడ్డీకే రుణా లు మంజూరు చేసి పొదుపును ప్రోత్సహిస్తోంది. 2025–26ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా సంఘాలు స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పడానికి రూ.55కోట్లు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. గత సంవత్సరం రూ.47కోట్లు రుణా లు అందించాల్సి ఉండగా.. రూ.50కోట్లు అందజేసి 106శాతం లక్ష్యాన్ని సాధించడంతో జిల్లా రాష్ట్ర స్థా యిలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తి తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేశారు. మెప్మా పరిధిలోని బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, నస్పూర్ మున్సిపాల్టీల్లో టీఎల్‌ఎఫ్‌లకు రూ.12,09,99,900 రుణాలు ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించారు. సెర్ప్ పరిధిలోని గ్రామైక్య మహిళా సంఘాలకు రూ.42కోట్లు కేటాయిస్తున్నట్లు రుణ ప్రణాళికలో అధికారులు పేర్కొన్నారు.
జిల్లాకు మంజూరైన యూనిట్లు
జిల్లాలో 705వీవోలు, 16,883 గ్రామైక్య సంఘాల్లో 1,80,369మంది సభ్యులున్నారు. జిల్లాకు వివిధ విభాగాల్లో యూనిట్లు మంజూరయ్యాయి. పాడిపరిశ్రమ (డెయిరీ ఫాంలు) 70, గొర్రెల పెంపకం 70, పౌల్ట్రీఫాంలు 2, పెరటి కోళ్ల పెంపకం 120, క్యాంటీన్ 1, హౌసింగ్‌లోన్లు (ఇళ్ల మరమ్మతు) 120, పీ ఎంఎఫ్‌ఎంఈ (ఫుడ్ ప్రాసెసింగ్) 50, వీధి వ్యాపారులు 70, లోకల్ కేబుల్ ఆపరేటర్లు 70, రాజీవ్ యువ వికాసం 240, వ్యవసాయేతర యూనిట్లు 1,400, వీవో స్థాయి సోలార్ ప్రాజెక్టు 1, రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు 120, ఈ ఆటో 20, ఈబైక్‌లు 20 యూనిట్లు మంజూరు చేయనున్నారు. రుణాల పంపిణీ, చెల్లింపులపై మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికా రులు తెలిపారు. సీ్త్రనిధి రుణాలు ఫోన్‌పే, పోస్టాఫీస్, బ్యాంక్ మిత్ర, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల ద్వారా చెల్లించేలా వివరిస్తున్నారు. రుణాలు తీసుకున్న సభ్యులకు యూనిట్ల ఆధారంగా బీమా చేయిస్తున్నామని, రుణాలు తీసుకున్న సభ్యులు మరణించిన పక్షంలో రుణం చెల్లించాల్సిన అవసరం ఉండదని అధికారులు తెలిపారు. ఈ రుణాల్లో సువిధ పథకం ద్వారా రూ.5వేల నుంచి రూ.50వేలు, ప్రగతిపథకం ద్వారారూ.50వేల నుంచి రూ.లక్ష వరకు, అక్షయ పథకంలో రూ.లక్ష నుంచి రూ.2లక్షల వర కు, సౌభాగ్యలో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వర కు, ఐశ్వర్య పథకంలో రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు.
2025–26 రుణ ప్రణాళిక ఖరారు
రుణ లక్ష్యం రూ.55 కోట్లు
స్వయం ఉపాధి యూనిట్లకు ప్రాధాన్యం
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
మహిళా సంఘాల స భ్యులు సీ్త్రనిధి ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలి. రుణాలు తీ సుకున్న సభ్యులు క్ర మం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తే తిరిగి మళ్లీ రుణం పొందే అవకాశం ఉంది. ఎక్కువ వడ్డీలకు మైక్రోఫైనాన్స్‌ల ద్వారా తీసుకుని ఆర్థికంగా నష్టపోవద్దు. ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి తక్కువ వడ్డీకే రుణా లు అందిస్తోంది. అర్హులంతా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి.
– వెంకటరమణ, సీ్త్రనిధి ప్రాంతీయ మేనేజర్

అతివలకు అండగా ‘సీ్త్రనిధి’