
వైద్య కళాశాలలో సదుపాయాలు కల్పిస్తాం
● రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ ఆయేషా మస్రత్‌ఖానం
మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో జా తీయ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసీ) నిబంధనల మేరకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆ రోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ ఆయేషా మస్రత్ ఖానం తెలిపారు. వైద్య కళాశాలల్లో సదుపాయా ల కల్పనకు ఏర్పాటైన మెడికల్ కాలేజీ మానిట రింగ్ కమిటీ (ఎంసీఎంసీ) బృందం సభ్యులు శని వారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. కాలేజీ రోడ్డులో మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని వార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో 450 పడకలతో నిర్మి స్తున్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనం పనులు పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కా లేజీలో ప్రిన్సిపాల్, వైద్య బృందంతో సమీక్షించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీతో పాటు అవసరమైన సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ ప ద్ధతిలో తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ జైసింగ్, టీజీఎంఎస్‌ఐడీసీ ఈఈ ఆదిలాబాద్ ఆర్.నర్సింహారావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సులేమాన్, సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రేఖ, ఆర్‌ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీమన్నారాయణ, డెమో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.