
విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● సీపీ అంబర్ కిషోర్ ఝా ● కమిషనరేట్‌లో నేర సమీక్ష
మంచిర్యాలక్రైం: పోలీస్ అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ అంబ ర్ కిషోర్ ఝా హెచ్చరించారు. పోలీస్ కమిషనరే ట్ ఆవరణలో శనివారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా నేరా లను సమీక్షించారు. పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకుని సూచనలు, సలహాలు ఇచ్చారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ.. కేసు పరిశోధనలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించా రు. కేసులు నమోదైన వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, స్టేషన్ ఎస్‌హెచ్‌వోలు ప్రతీరో జు ఒక గంట పెండింగ్ కేసులపై సిబ్బందితో స మీక్షించాలని ఆదేశించారు. బాలికల మిస్సింగ్ కే సుల్లో రికార్డుల దర్యాప్తు వేగవంతం చేయాలని తెలిపారు. రౌడీ షీటర్లపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ఇటీవల బెల్లంపల్లిలో ఏటీఎం చోరీకి యత్నించిన వారిని పట్టుకున్న నెన్నెల ఎస్సై ప్రసాద్, బ్లూకోల్ట్స్ సిబ్బందిని అభినందిస్తూ క్యాష్ రివార్డు అందజేశారు. సమావేశంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ రాజు, ఎస్‌బీ ఏసీపీ మల్లారెడ్డి, ఏసీపీలు ఆర్ ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.