
రైతులకు ప్రభుత్వ అండ
● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
దండేపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శని వారం రైతు భరోసా సంబరాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్నా రు. ఎడ్లబండి నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రైతులందరి ఖాతాల్లో రైతు భరో సా డబ్బులు పడ్డాయని, ఖరీఫ్ సాగు ఖర్చులకు వినియోగించుకోవాలని సూచించారు.
విద్యార్థులకు ఎలాంటి లోటు రావొద్దు
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి లోటు రావద్దని ఎమ్మె ల్యే ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు. దండేపల్లి కే జీబీవీ, లింగాపూర్ మోడల్‌స్కూల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు, సిబ్బందితో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కేజీబీవీలో కోతుల బెడద ఉన్నట్లు విద్యార్థులు తెలుపగా పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం లింగా పూర్ మోడల్ స్కూల్‌లో చేపట్టిన పలు నిర్మాణాలను పరిశీలించారు. ఎంపీడీవో ప్రసాద్, అ ధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రారంభానికి సిద్ధం చేయాలి
లక్సెట్టపేట: ప్రభుత్వ ఆస్పత్రి భవనం ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సూచించారు. మండల కేంద్రంలో చేపట్టి న ఆస్పత్రి భవన నిర్మాణ పనులు పరిశీలించి మాట్లాడారు. ఆస్పత్రి భవనం ప్రారంభ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని, మిగతా పనులు పూ ర్తి చేయాలని సూచించారు. నాయకులు ఎండీ ఆరీఫ్, పింగిళి రమేశ్, అశోక్, నాగభూషణం, శ్రీనివాస్, సురేశ్, స్వామి, తహసీల్దార్ దిలీప్‌కుమార్, వైద్యులు శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు.