
కాసిపేటలో వందశాతం అక్షరాస్యత
కాసిపేట: మండలంలో కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘100 రోజుల్లో వందశాతం అక్షరాస్యత’ కార్యక్రమం విజయవంతమైంది. 3,462 మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులు గా గుర్తింపు తెచ్చుకున్నారు. శనివారం జిల్లా వయోజన విద్య అధికారి పురుషోత్తంనాయక్ ఆధ్వర్యంలో ధర్మరావుపేట, ముత్యంపల్లి రైతువేదికలతో పాటు గ్రామపంచాయతీలవారీగా పరీక్షలు నిర్వహించి మూల్యాంకనం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, తహసీల్దార్ భోజన్న, ఆత్మ చై ర్మన్ రౌతు సత్తయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుప తి, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, ఏవో ప్రభాకర్, ఎంపీవో షేక్ సబ్ధర్ అలీ, డీఆర్పీలు శాంకరి, జనార్దన్, అశోక్‌రావు, వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, నాయకులు రమేశ్, స్వామి, శ్రీనివాస్, నారాయణ, కార్యదర్శులు, అధికారులు, వలంటీర్లు పాల్గొన్నారు.