
చదువుతో జ్ఞానం, ధైర్యం
వేమనపల్లి: చదువు మనిషికి జ్ఞానం, ధైర్యాన్ని అందిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ జెడ్పీటీసీ ఆర్.సంతోష్‌కుమార్‌తో కలిసి నీల్వాయి జూనియర్ కాలేజీలో రూ.66 లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వేమనపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేకు పలు గ్రామాల రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాబీర్‌ఆలీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్యమాదిగ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ గంగారాం, ఎంపీడీఓ కుమారస్వామి, తహసీల్దార్ సంధ్యారాణి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌లు గాలి మధు, తోకల రాంచందర్, మాజీ ఎంపీపీలు వెంకటేషం, లింగాగౌడ్ పాల్గొన్నారు.