
లక్ష్యాల సాధనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
శ్రీరాంపూర్/జైపూర్: నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే.వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. క్వారీలోకి వెళ్లి కోల్ బెంచీలు, ఆఫ్‌లోడింగ్ ప్రదేశాలు పరిశీలించారు. జైపూర్ మండలం ఇందారం ఐకే–ఓసీపీ ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని నూరు శాతం సాధించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, ఏరియా ఎస్‌ఓటు జీఎం యన్.సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఓసీపీ పీఓ చిప్ప వెంకటేశ్వర్లు, ఇందారం ఓసీపీ పీఓ ఏవీ రెడ్డి, మేనేజర్లు నాగన్న, శంకర్, ఇంజనీర్ రామకృష్ణరావు, రక్షణాధికారి మహేశ్, ఫారెస్ట్ అధికారి మేఘన, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, ఫిట్ ఇంజనీర్ భీమన్న తదితరులు పాల్గొన్నారు.