ఎట్టకేలకు వేతనాలు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు వేతనాలు

Jun 28 2025 6:05 AM | Updated on Jun 28 2025 7:41 AM

ఎట్టకేలకు వేతనాలు

ఎట్టకేలకు వేతనాలు

● డీఎస్సీ–2008 ఎస్జీటీల సాలరీ నిధుల విడుదల ● గత ఫిబ్రవరిలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా చేరిక ● 61మంది ఉపాధ్యాయులకు లబ్ధి ● ఉమ్మడి జిల్లాకు రూ.2.5 కోట్లు విడుదల

నిర్మల్‌ఖిల్లా: ఉద్యోగ నియామకం కోసం పరీక్ష రాసి ఎంపికై న తర్వాత 15 ఏళ్లుగా వేచి చూసిన వా రికి గత ఫిబ్రవరిలో నియామక ఉత్తర్వులు చేతికందాయి. ఫిబ్రవరి 16వ తేదీన కాంట్రాక్ట్‌ ఎస్జీటీలుగా కొలువులో చేరిన వీరికి ఇప్పటివరకు వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు ఉమ్మ డి జిల్లాలోని ఎస్జీటీలకు రూ.2.5 కోట్ల నిధులు వి డుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విధుల్లో చేరిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని 61 మంది కాంట్రాక్ట్‌ ఎస్జీటీలు హర్ష వ్యక్తం చేస్తున్నారు.

డీఎస్సీ 2008 బాధితులు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్‌ వెలువడిన అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా డీఈడీ అభ్యర్థులకు కేటాయించడంతో అప్పడు బీఈడీ పూర్తి చేసుకుని ఎస్జీటీలు గా ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని 100 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటినుంచి దశాబ్దకాలానికి పైగా కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులకు కాంట్రాక్ట్‌ విధానంలో ఎస్జీటీలుగా నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గత ఫిబ్రవరి 15వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 61 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. 16ఏళ్ల పాటు ఉద్యోగాలకు దూరమై కోర్టుల చుట్టూ తిరిగిన వీరికి నియామకాలు పొందిన త ర్వాత కూడా దాదాపు నాలుగు నెలలు పూర్తవుతు న్నా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 2025– 26 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్‌ కేటాయించగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మ ల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కాంట్రాక్ట్‌ ఎస్జీటీలుగా విధులు ని ర్వహిస్తున్న 61 మందికి వేతనాలు అందనున్నాయి. ఒక్కో ఎస్జీటీకి నెలకు బేసిక్‌ పే రూ.31,040 కాగా, నాలుగునెలల వేతనాలు వారి అకౌంట్లలో జమచేయనున్నారు.

సుధీర్ఘ నిరీక్షణ అనంతరం

నిర్మల్‌ జిల్లాలో 14 మంది, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 28 మంది, ఆదిలాబాద్‌ జిల్లాలో ఏడుగురు, మంచిర్యాల జిల్లాలో 12 మంది కాంట్రాక్ట్‌ ఎస్జీటీలున్నారు. వీరి నాలుగు నెలల పెండింగ్‌ వేతనాలు చెల్లింపునకు ఉమ్మడి జిల్లాకు రూ.2కోట్ల 54లక్షల 93వేల 800 విడుదల చేయడంతో నిర్మల్‌ జిల్లాకు చెందిన కాంట్రాక్ట్‌ ఎస్జీటీలు గంగాధర్‌, రాజేశ్వర్‌, ప్రభ, చంద్రశేఖర్‌, వినోద్‌ తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

జిల్లా ఎస్జీటీలు విడుదలైన నిధులు (రూ.లో)

నిర్మల్‌ 14 58,51,000 ఆదిలాబాద్‌ 07 29,25,500 కుమురంభీం 28 1,17,02,100 మంచిర్యాల 12 50,15,200

మొత్తం 61 2,54,93,800

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement