
కాళ్లు కడిగి వీడ్కోలు పలికారు
భైంసాటౌన్: పట్టణంలోని ఏరియాస్పత్రిలో పారిశు ధ్య విభాగంలో పనిచేసిన కార్మికురాలు చంద్రబా యికి ఆస్పత్రి సిబ్బంది అరుదైన వీడ్కోలు పలికా రు. పట్టణానికి చెందిన చంద్రబాయి 15 ఏళ్లుగా ఆ స్పత్రిలో సేవలందిస్తోంది. 60 ఏళ్లు పూర్తి కావడం, అనారోగ్య కారణాలతో ఉద్యోగ విరమణ పొందింది. దీంతో శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ ఆధ్వర్యంలో ఆమెకు వీడ్కోలు కార్యక్ర మం నిర్వహించారు. శాలువా, పూలమాలతో సత్కరించారు. సిబ్బంది ఆమె కాళ్లు కడిగి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. దీంతో వైద్యులు అనిల్, నర్సులు, తోటి సిబ్బంది వారిని అభినందించారు.