
దేశీదారు పట్టివేత
వాంకిడి: మహారాష్ట్ర నుంచి ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న దేశీదారును శుక్రవారం పట్టుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు వాంకిడి బస్టాండ్‌లో ఏఎస్సై పోశెట్టి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. గడ్చిరోలి జిల్లా సిరోంచకు చెందిన మారగోని కృష్టమూర్తిగౌడ్ బస్సులో దేశీదారు తరలిస్తూ పట్టుబడ్డాడు. అతడి నుంచి 250 (90ఎంఎల్) దేశీదారు మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.12,500 ఉంటుందని పేర్కొన్నారు.