జీవో 49ని అమలు కానివ్వం | - | Sakshi
Sakshi News home page

జీవో 49ని అమలు కానివ్వం

Jun 28 2025 6:03 AM | Updated on Jun 28 2025 7:41 AM

జీవో 49ని అమలు కానివ్వం

జీవో 49ని అమలు కానివ్వం

● ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ● ఆదివాసీ సంఘాల నాయకులతో సమీక్షా సమావేశం

ఉట్నూర్‌రూరల్‌: జీవో 49ని అమలు కాకుండా చూస్తామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలోగల పీఎమ్మార్సీ సమావేశ మందిరంలో ఆదివాసీ సంఘాల నాయకులు, పెద్దలతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కేబీ ప్రాంగణంలోని కుమురంభీం విగ్రహంపై పూ లు చల్లి నివాళులర్పించారు. ముందుగా ఆదివాసీ పెద్దలు మాట్లాడుతూ.. పులుల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు పేరిట జీవో 49 అమలు అంటూ ఫారెస్ట్‌ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరో పించారు. జీవోను రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు, గిరిజన పెద్దలు, ఎమ్మెల్యేలు కో వ లక్ష్మి, హరీశ్‌బాబు డిమాండ్‌ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జీవో 49పై గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇంకా జారీ చేయలేదని, అమల్లోకి రాలేదని చె ప్పారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయవద్దని అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఆది వాసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలి పారు. అటవీ, పర్యావరణ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించి ఆదివాసీలకు మేలు చేసేలా సముచిత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉందని తెలిపారు.

గెజిట్‌ వచ్చిందన్న ఎంపీ నగేశ్‌

జీవో 49పై గెజిట్‌ రాలేదని మంత్రి జూపల్లి అంటున్న సందర్భంలో ఎంపీ గోడం నగేశ్‌ కల్పించుకుని గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చిందని తెలిపారు. దీంతో స్పందించిన మంత్రి సమావేశంలోనే అటవీశాఖ ఉన్నతాధికారిని ఫోన్‌లో సంప్రదించగా ఇంకా జారీ చేయలేదని సమాధానం రాగా సమావేశం సజావుగా సాగింది. ఖానాపూర్‌ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. సీఎం దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కలెక్టర్లు రాజర్షిషా, వెంకటేశ్‌ దోత్రే, ఎస్పీలు అఖిల్‌ మహాజన్‌, కాంతిలాల్‌ పాటిల్‌, డీఎఫ్‌వోలు నీరజ్‌కుమార్‌, ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, రాయిసెంటర్‌ సర్మేడి దుర్గు, ఏఎస్పీ కాజల్‌, సబ్‌కలెక్టర్‌ యువరాజ్‌, ఆయా శాఖల అధికారులు, ఆదివాసీలు పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి స్తూపం వద్ద నివాళి

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి ఉ మ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పూ లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్మృతి వనంలో మొక్క నాటారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్‌, కలెక్టర్‌ రాజర్షిషా, ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా, ఏఎంసీ చైర్మన్‌ ముఖడే ఉత్తం, రగల్‌ జెండా ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు తోడసం నాగోరావ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement