
మానవ అక్రమ రవాణా కేసులో మరో ఇద్దరి అరెస్ట్
● హరిదాస్‌ను కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగింపు
సాక్షి, ఆసిఫాబాద్: మానవ అక్రమ రవాణాకు పా ల్పడి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను ఆసిఫాబాద్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ శుక్రవారం మధ్యాహ్నం సీఐ రవీందర్‌తో కలిసి విలేకరులకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లో.. ‘మానవ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయి. తన కూతురు ఏడాదిగా కనబడడం లేదని ఈ నెల 11న వాడిగొంది గ్రామవాసి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించాం. మహిళకు చెందిన ఆధార్ కార్డులోని ఫోన్ నంబర్‌కు కాల్ చేయగా.. ఆమె మ ధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ఒక పోలీస్ బృందాన్ని మ ధ్యప్రదేశ్‌కు పంపి ఆమెను ఇక్కడికి తీసుకువచ్చాం. ఆమె ఇచ్చిన వివరాల మేరకు.. చింతలమానేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2022 నుంచి విధులకు గైర్హాజరవుతున్న కామెరి హరిదా స్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలోనే.. తననూ కానిస్టేబుల్ హరిదాస్ ముఠా మో సం చేసి విక్రయించిందని ఆసిఫాబాద్ పట్టణ స్టేష న్‌లో ఫిర్యాదు చేసింది. ఈ రెండు వేర్వేరు కేసుల్లో లోతుగా దర్యాప్తు చేపట్టగా మొత్తం 10 మందికి సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఎనిమిది మంది నిందితులను 10రోజుల కిందట అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం. పరారీలో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన బషీర్ రమేశ్‌గౌడ్ (ఏ7), జగదీశ్ సోనీ (ఏ9)ని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం.’ అని ఏఎస్పీ తెలిపారు.
‘తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి’
‘పెళ్లికుమారుడికి వరకట్నం ఇస్తేనే ఆడపిల్లలకు పె ళ్లిళ్లు జరుగుతున్న నేటి పరిస్థితుల్లో.. ఆడపిల్లకు ఎ దురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి మోసగించి ఇతర రాష్ట్రాలకు తరలి స్తు న్న వారిపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అసలు వారు తమ పిల్లను ఎందుకు పెళ్లి చేసుకో వాలనుకుంటున్నారు? వారి వివరాలు ఏమిటి? వా రు ఎక్కడి నుంచి వచ్చారు? వారికి స్థానికంగా సహకరిస్తున్న వారెవరు? అలాంటి వారి గత చరిత్రపై ఆరా తీయాలి. ఎలాంటి సందేహం తలెత్తినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం చేస్తాం.’ అని ఏఎస్పీ సూచించారు.
కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి తొలగింపు
తిర్యాణి పోలీస్ట్‌స్టేషన్ పరిధిలో ఇదివరకు ఇలాంటి కేసులో ముద్దాయిగా ఉన్న కానిస్టేబుల్ కామెరి హరిదాస్.. మళ్లీ తన విధానం మార్చుకోకపోగా తాజాగా రెండు వేర్వేరు కేసుల్లో నిందితుడిగా తేలింది. దీంతో అతనిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయగా.. గురువారం అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులపైనా కఠినచర్యలు ఉంటాయనడానికి కానిస్టేబుల్ హరిదాస్ ఉధంతమే ఒక నిదర్శనం.