
సడెన్‌గా ఆగిన లారీని ఢీకొన్న ఆటో
● తీవ్రంగా గాయపడ్డ ఆటో డ్రైవర్ మృతి ● ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు ● ఒకరి పరిస్థితి విషమం
జైపూర్: కళ్లు మూసి తెరిచేలోపే మృత్యువు కబలించింది. వేగంగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగడంతో వెనుక వస్తున్న ఆటో అదుపు తప్పి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ టో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని సాయిరాంనగర్‌కు చెందిన పౌడల రాజేశ్ (30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నా డు. శుక్రవారం ఉదయం మంచిర్యాల నుంచి గోదా వరిఖనికి రాళ్లపేటకు చెందిన సయ్యద్ అజీమ్, బెల్లంపల్లికి చెందిన ఆయిల్ల రమను ఆటోలో గో దావరిఖనికి తీసుకువెళ్తున్నాడు. ఇందారం అటవీ శాఖ చెస్‌పోస్టు దాటిన తర్వాత గోదావరి బ్రిడ్జి వద్ద మంచిర్యాల నుంచి గోదావరిఖని వైపు వేగంగా వెళ్తున్న లారీని డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేసి నిలిపివేయడంతో వెనుకే వస్తున్న ఆటో అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ముందు భా గం నుజ్జునుజ్జు కాగా, ఆటో డ్రైవర్ రాజేశ్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఇద్దరు ప్యాసింజర్లు సయ్యద్ అజీమ్, అయిల్ల రమ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమ తలకు బలమైన గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను కరీంనగర్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఎస్సై శ్రీధర్ పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడు రాజేశ్‌కు ఇద్దరు భార్యలు లావణ్య, గా యత్రి ఉన్నారు. రెండ్రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడడం గమనార్హం.

సడెన్‌గా ఆగిన లారీని ఢీకొన్న ఆటో

సడెన్‌గా ఆగిన లారీని ఢీకొన్న ఆటో

సడెన్‌గా ఆగిన లారీని ఢీకొన్న ఆటో