
ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన
బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టె క్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసరలో మహబూబ్‌నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటా ఆధారిత విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం చేపట్టారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ మురళీదర్శన్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గో వర్ధన్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ చాలా సమర్థవంతంగా, సజావుగా ముందుకు సాగుతోందని తె లిపారు. నాణ్యమైన విద్య, విద్యార్థుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతీ సమస్యను పట్టుదలతో పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమర్థవంతంగా యూనివర్సిటీని నిర్వహించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎన్‌సీసీ కోటాలో వి ద్యార్థులు అందించిన క్యాంప్ సర్టిఫికెట్లు, రిపబ్లిక్ డే పరేడ్ సర్టిఫికెట్లు పూర్తిగా పరిశీలించినట్లు చెప్పారు. స్పోర్ట్స్ కోటా కోసం 31 క్రీడల జాబితాలో లభించే ఆటల ఆధారంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పొందిన ప్రమాణ పత్రాలను తప్పనిసరి గా ధ్రువీకరించినట్లు తెలిపారు. క్రీడా సంఘాల గుర్తింపు, పోటీల స్థాయి, తేదీ, అర్హత ప్రమాణాల ను బట్టి జాగ్రత్తగా తనిఖీ చేసినట్లు చెప్పారు. ధ్రువపత్రాల పరిశీలనను కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కోకన్వీనర్లు డాక్టర్ దేవరాజు, డాక్టర్ విఠల్, డాక్టర్ భవ్‌సింగ్, డాక్టర్ రాకేశ్‌రెడ్డి సమన్వయం చేశారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ ఇన్‌చార్జి దస్తగిరి, స్పోర్ట్స్ ఇన్‌చార్జి పీడీ శ్యాంబాబు, సహాయకులు కిషన్, ఉదయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.