
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ మృతి
జైపూర్: మండలంలోని ఇందారం అ టవీశాఖ చెక్‌పోస్టు సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి జరిగి న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జాదవ్ సూర్యకుమార్ (30) మందమర్రిలో నివాసం ఉంటున్నాడు. మందమర్రికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ పిల్లి వెంకటేశ్‌తో కలిసి బుధవారం రామగుండం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వీవో షోరూం సమీపంలో అడ్డువచ్చిన అడవిజంతువును తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నారు. ఘటనలో బైక్ నడుపుతున్న సూర్యకుమార్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న వెంకటేశ్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సూర్యకుమార్ భార్య రాజశ్రీ సింగరేణిలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై అభిబ్ తెలిపారు.
ఇసుక వేలం
బెల్లంపల్లి: అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తూ పట్టుబడిన ఇసుకకు గురువారం వేలం నిర్వహించారు. రెండు రోజుల క్రితం గ్రామీణ ప్రాంతాల నుంచి దొంగతనంగా రెండు ట్రాక్టర్లలో బెల్లంపల్లికి ఇసుకు తీసుకువస్తుండగా ఎస్సై కె.మహేందర్ పట్టుకుని టూటౌన్‌కు తరలించారు. సదరు ట్రాక్టర్లలో ఉన్న ఇసుకకు బహిరంగ వేలం నిర్వహించగా రూ.3,200కు సుస్మిత్ అనే యువకుడు దక్కించుకున్నాడు. ఈ వేలం పాటలో రెవెన్యూ అధికారి రమేశ్ పాల్గొన్నారు.