
వేలాల గట్టు మల్లన్న గుట్టపై గిరిప్రదక్షణ
జైపూర్: మండలంలో ప్రసిద్ధిగాంచిన వేలాల గట్టు మల్లన్నస్వామి సన్నిధిలో గురువారం 9వ గిరి ప్రదక్షణ కార్యక్రమం వైభవంగా చేపట్టారు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సురేశ్ ఆత్మారాం మహారాజ్ కుమారులు శ్రేయాంష్ మహారాజ్ ఆధ్వర్యంలో గట్టు మల్లన్న స్వామి గుట్టపైన గిరిప్రదక్షణ చేపట్టారు. ఆయా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గిరిప్రదక్షణలో పాల్గొని దొణలో స్వయంబువుగా వెలిసిన గట్టు మల్లన్న స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై భక్తుల సందడి నెలకొంది. అనంతరం నిర్వహించిన అన్నదానంలో భక్తులు పాల్గొన్నారు.