
ఆటో డ్రైవర్‌పై కేసు
ఆదిలాబాద్‌టౌన్: మహిళను మోసగించిన ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు జైనథ్ మండలంలోని మాకోడ గ్రామానికి చెందిన రాచర్ల హీరక్క ఈనెల 24న ఆదిలాబాద్ పట్టణంలోని నటరాజ్ థియేటర్ వద్దకు వచ్చింది. అక్కడి నుంచి సుభాష్‌నగర్‌లో ఉన్న తన మనుమని వద్దకు వెళ్లేందుకు ప్యాసింజర్ ఆటోలో ఎక్కింది. డ్రైవర్ సుభాష్‌నగర్ వైపు వెళ్లకుండా ఆటోను తాంసి బస్టాండ్ వైపు మళ్లించాడు. దీంతో సదరు మహిళ కేకలు వేయగా ఆమె వద్ద ఉన్న సంచి, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లాడు. సంచిలో రూ.17,500 నగదు ఉన్నట్లు మహిళ వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అసత్య ప్రచారం చేసిన ఒకరిపై..
నెన్నెల: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన దుర్గం రవిపై గురువారం కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడని నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన అత్తిని బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఒకరిపై కేసు నమోదు
గుడిహత్నూర్: విలేకరినని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై మధుకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని సీతాగోందికి చెందిన అరుగుల సంతోష్ తాటికల్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం భూమేశ్ అనే వ్యక్తి ఫోన్‌చేసి తాను విలేకరినని, మీరు కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సంతోష్ సదరు వ్యక్తికి రూ.2వేలు ఇచ్చినట్లు తెలిపాడు. కాగా ఈ విషయాన్ని బాధితుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ చేపట్టిన పోలీసులు సదరు విలేకరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
స్పోర్ట్స్ అర్హత పరీక్షకు విద్యార్థుల ఎంపిక
వేమనపల్లి: మంచిర్యాల క్రీడా ప్రాతిపాదిక సంస్థ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాల ఎంపిక పోటీలలో మండలంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎంఈవో శ్రీధర్‌రెడ్డి, పీఈటీ మల్లేశ్ తెలి పారు. ఎంపికై నవారిలో అంజన్న (కల్మలపే ట), ఎం.వర్షిణి (కొత్తపల్లి), శ్రీహిత (గెర్రెగూ డం), శ్రీజ (సుంపుటం), జి.హారిక (కేతన్‌పల్లి), ఏ. మేఘన (కొత్తపల్లి) ఉన్నారు.
తాంసిలో క్లోరల్‌హైడ్రేట్ పట్టివేత
తాంసి: మండల కేంద్రం శివారులో ఉన్న ఓ పశువుల పాకలో రెండు రోజుల క్రితం 20 కిలోలకు పైగా నిషేధిత క్లోరల్‌హైడ్రేట్‌ను ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టుకున్న ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలానికి చెందిన ఓ వ్యక్తి నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుంచి క్లోరల్‌హైడ్రేట్‌ను ఆదిలాబాద్‌కు తీసుకొచ్చి గ్రామాల వారీగా ఆయా దుకా ణా లకు చేరవేస్తున్నట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న అబ్కారీ బృందం ఘటన స్థలా నికి చేరుకొని పెద్ద ఎత్తున నిషేధిత క్లోరల్‌హైడ్రేట్ పట్టుకున్నారు. అధికారులు ఈ విషయం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రాకుండా అధికారులు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ విజేందర్‌ను సంప్రదించగా గ్రామ శివారులో ఖాళీగా ఉన్న స్థలంలో కేవలం ఐదు కిలోలు మాత్రమే పట్టుకున్నట్లు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు.