
రెండు లారీలు ఢీ..డ్రైవర్ మృతి
● మరో డ్రైవర్‌కు తీవ్రగాయాలు
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యా యి. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. దేవపూర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తున్న సిమెంటు ట్యాంకర్ సంతూర్ సబ్బుల లోడ్‌తో హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ బయలుదేరిన లారీ ఇటిక్యాల సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకున్న సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు జరిపించారు. ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ కాసిపేట మండలం పలాంగూడకు చెందిన శ్రీనివాస్ (52) క్యాబిన్‌లో ఇరుక్కుని మృతి చెందాడు. క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ సచిన్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాలలోని ప్రైవే టు ఆస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాస్ భార్య విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

రెండు లారీలు ఢీ..డ్రైవర్ మృతి