
కమిట్‌మెంట్‌తో పనిచేయాలి
ఆదివాసీలతో పాటు భౌగోళికంగా విస్తీర్ణం కలిగిన జిల్లాలో సమస్యలు అధికంగానే ఉంటాయి. వాటి పరిష్కారానికి చొరవ చూపాలి. ప్రజలకు సేవ చేయాలనే కమిట్‌మెంట్‌తో పనిచేయాలి. గృహజ్యోతి సమస్యల పరిష్కారం కోసం సింగిల్ విండో కౌంటర్‌ను ఏర్పాటు చేస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి రూ.200 కోట్లతో 100 ఇంటిగ్రేటేడ్ పాఠశాలలను నిర్మిస్తున్నాం. పేదలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి. గ్యాస్ సబ్సిడీ సక్రమంగా అందేలా చూడాలి. సమస్యలు తెలిపితే సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తాం.
– గడ్డం వివేక్, రాష్ట్ర కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి