
అధికారుల తీరు సరికాదు
జిల్లాలో పోడు, రెవెన్యూ భూముల సమస్య ప్రత్యేక సర్వే నిర్వహిస్తేనే పరిష్కారమవుతుంది. కడెం, దస్తురాబాద్ మండలాల్లో అటవీ అధికారులతో తీవ్ర ఇబ్బందులెదురవుతున్నాయి. పీపీ ల్యాండ్స్ సాగు చేస్తున్న గిరిజనేతరులకు గతంలో పహాణీల ద్వారా రుణాలందేవి. 30–40 ఏళ్లుగా సాగు చేస్తున్న గిరజనేతరులకు ప్రత్యామ్నాయం చూపాలి. అటవీ అధికారులు అభివృద్ధి పనులు అడ్డుకుంటుండగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులను ఇతర జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ చేయలి.
– వెడ్మ బొజ్జుపటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే