
షెట్టర్ల కేటాయింపుల్లో అక్రమాలు
బెల్లంపల్లి: సమీకృత కూరగాయల మార్కెట్ షెట్టర్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. గురువారం బెల్లంపల్లి ము న్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వినోద్ అనుచరులు కొందరికి మార్కెట్‌తో సంబంధం లేకున్నా షెట్టర్లు కట్టబెట్టారని తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్, కొందరు మాజీ ప్రజాప్రతినిధుల బంధువులకు మంజూరులో అక్రమాలు జరిగాయని పేర్కొన్నా రు. అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బీఆర్‌ఎస్ శ్రేణులను మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మా జీ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రేవెల్లి విజయ్, పట్టణ యూత్ అధ్యక్షుడు అరుణ్, బీఆర్‌ఎస్, అనుబంధ సంఘాల శ్రేణులు చంద్రయ్య, అలీ, సాజిద్, వాజిద్, సు భాష్‌రావు, తదితరులు పాల్గొన్నారు.