
రోడ్డు పనులు ప్రారంభించాలి
చెన్నూర్‌రూరల్: వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలని, లేనిపక్షంలో తాత్కాలిక మరమ్మతు చేయిస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ అన్నారు. గురువారం మండంలోని గంగారం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ మంత్రి వివేక్ ఆధ్వర్యంలో రోడ్డు పనులు ప్రారంభించారని, ఇంతవరకు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బురద రోడ్డుపై నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్‌గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆలం బాపు, మంత్రి రామయ్య, నాయకులు కాశెట్టి నాగేశ్వర్‌రావు, కొటారి వెంకటేశ్, దుర్గం రాజబాపు, కుడుదుల రాజన్న పాల్గొన్నారు.