
ఇందన్‌పల్లి ఎఫ్‌ఆర్వోగా శ్రీధరచారి
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ ఇందన్‌పల్లి అటవీ రేంజ్ అధికారి(ఎఫ్‌ఆర్‌వో) కారం శ్రీని వాస్ బదిలీ అయ్యారు. ప్రభుత్వం డిప్యూటీ రేంజ్ అధికారులకు రేంజ్ అధికారులుగా పదోన్నతి కల్పించింది. దీంతో సిర్పూర్(టి) డీఆర్వో శ్రీధరచారిని పదోన్నతితో ఇందన్‌పల్లి రేంజ్ అధికారిగా నియమిస్తూ పీసీసీఎఫ్ సువర్ణ ఆదేశాలు జారీ చేశారు. ప్ర స్తుత ఇన్‌చార్జి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ తిరిగి జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎఫ్‌ఆర్వోగా చేరే అవకాశాలున్నాయి. జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో రేంజ్ అధికారిగా పని చేసిన ఆయనకు గత ఏడాది అక్టోబర్ 14న ఇందన్‌పల్లి రేంజ్ అధికారిగా ఇంచార్జి బాధ్యతలు ఇచ్చారు. ఎనిమిది నెలల కాలంలో ఇందన్‌పల్లి రేంజ్ పరిధిలో ఇసుక, కలప అక్రమ రవాణాను అరికట్టారు. సిమెంటు ఇటుకల తయారీకి ఇసుక తరలించకుండా చర్యలు తీసుకున్నారు.