
జూలై 9న దేశ వ్యాప్త సమ్మె
శ్రీరాంపూర్: కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశ వ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య తెలిపారు. బుధవారం ఆయన ఆర్కే 7 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి కార్మికులు సమ్మెను విజయవంతం చేయాలన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని, వీటివల్ల కార్మికవర్గం తమ హక్కులు కోల్పోనుందని తెలిపారు. ఈ నెల 27న సింగరేణి యాజమాన్యంతో డైరెక్టర్(పా) స్థాయిలో స్ట్రక్చరల్ సమావేశం జరుగుతుందని, కార్మికుల సా ధారణ మరణానికి కుటుంబాలకు రూ.10 లక్ష ల బీమా సదుపాయం కల్పించాలని కోరుతామని అన్నారు. ఈ సమావేశంలో యూని యన్ కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచీ కార్యదర్శి షేక్ బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్‌రావు, నాయకులు ప్రసాద్‌రెడ్డి, అద్దు శ్రీని వాస్, గండి సతీశ్, శేఖర్, ఫిట్ సెక్రెటరీ మారుపల్లి సారయ్య, నాయకులు అఫ్రోజ్‌ఖాన్, ఆకుల లక్ష్మణ్ పాల్గొన్నారు.