
‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే’
మంచిర్యాలటౌన్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాందీ విధించిన ఎమర్జెన్సీ 50 ఏళ్లు పూర్తి చేసుకుందని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలో ఎమర్జెన్సీ ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథ్, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, ముల్కల్ల మల్లారెడ్డి, కొయ్యల ఏమాజి, మున్నారాజా సిసోడియా, దుర్గం అశోక్, బియ్యాల సతీశ్‌రావు, ఆకుల అశోక్‌వర్ధన్, ఎనగందుల కృష్ణమూర్తి, మోటపలుకుల తిరుపతి, పానుగంటి మధు, మోటపలుకుల గురువయ్య, గాజుల ముఖేశ్‌గౌడ్, మల్యాల శ్రీనివాస్, గుండా ప్రభాకర్, గాదె శ్రీనివాస్, జోగుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.