
మౌలిక వసతులతో గిరిజన గ్రామాల అభివృద్ధి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేక చొరవ చూపితే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి డి.జనార్దన్ అన్నారు. సోమవారం హాజీ పూర్ మండలం నాగారంలోని కొలాంగూడ గిరిజన తండాలో ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తి జన జాతీయ అభియాన్, గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాలపై గిరిజ నులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నిరుపేదలకు పక్కాగృహాలు, మంచినీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం, ఆరో గ్యం, టెలి కమ్యూనికేషన్ వంటి ఏర్పాట్ల చేయడంతోపాటు బ్యాంకు ఖాతాలు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండేలా చూస్తామని తెలిపారు. గిరిజనుల నుంచి రేషన్‌కార్డు, ఆరోగ్య కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యుత్ బిల్లులు, భూ సమస్యల అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేకాధికారి, ఏఈ గిరిజ, జిల్లా గిరిజన క్రీడల అధికారి బండ జీవరత్నం, మెడికల్ అధికారి ఆదిత్యభాను, పంచా యతీ కార్యదర్శి రాజామల్లయ్య, గఢ్‌పూర్ పీహెచ్‌సీ అధికారి సుధాకర్, ఎస్‌సీఆర్‌పీ రఘునాథం, చందు, తదితరులు పాల్గొన్నారు.