
‘శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం’
మంచిర్యాలటౌన్: జన సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్‌ను పురస్కరించుకుని ఆయన చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగా లు ఉండవద్దనే నినాదంతో ఆర్టికల్ 370 రద్దు చేయాలని పోరాటం చేశారని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం జన సంఘ్‌ను స్థాపించి ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, బియ్యాల సతీశ్‌రావు, ఆకుల అశోక్‌వర్థన్, ఎనగందుల కృష్ణమూర్తి, గాజుల ముఖేశ్‌గౌడ్, తుల ఆంజనేయులు, జోగుల శ్రీ దేవి, కర్రె లచ్చన్న, అమిరిశెట్టి రాజ్‌కుమార్, ప ల్లి రాకేశ్, వైద్య శ్రీధర్, నాగుల రాజన్న, మెరిడికొండ శ్రీనివాస్, రెడ్డిమల్ల అశోక్, రాకేశ్ రెన్వా, తరుణ్‌సింగ్, చిరంజీవి పాల్గొన్నారు.