
బస్సుల్లో పోలీసుల తనిఖీలు
మంచిర్యాలక్రైం/మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో గంజాయి, నిషేధిత పత్తి విత్తనాల అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ప్రత్యేక బలగాలతో తనిఖీలు చేపట్టారు. మంచిర్యాలలో సీఐ ప్రమోద్‌రావు తనిఖీల్లో పాల్గొన్నారు. ఉట్నూర్ వైపు నుంచి మంచిర్యాల వైపు ఓ బస్సులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు హాజీపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ తనిఖీలు చేపట్టారు. కాగా, గంజాయి తరలిస్తున్న వ్యక్తి లక్సెట్టిపేటలో బస్సు మారి వెళ్తూ ధర్మారం పోలీసులకు తనిఖీల్లో సుమారు 2కిలోల గంజాయితో పట్టుబడినట్లు సమాచారం.