
‘రాజకీయాలకు అతీతంగా ఇళ్లు కేటాయించాలి’
పాతమంచిర్యాల: రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నా రు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సీపీఐ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16మంది సభ్యులతో జిల్లా సమితి, 51మంది సభ్యులతో కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని తెలిపా రు. సీపీఐ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మ ణ్ రెండోసారి ఎన్నికయ్యాడని పేర్కొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకుల ఆమోదంతో పలు తీర్మానాలు చేసినట్లు తెలి పారు. సింగరేణి ప్రాంతంలో 76జీవో ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ప్రాణహిత–చేవేళ్లను తుమ్మిడిహెట్టి వద్దనే నిర్మించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కా ర్యవర్గ సభ్యులు ఖలీందర్ ఆలీఖాన్, మేకల దాసు, బొల్లం పూర్ణిమా, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, భీమానాథుని సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య, దాగం మల్లేష్, రేగుంట చంద్రకళ, ముస్కే సమ్మయ్య పాల్గొన్నారు.