
తల్లిదండ్రుల చెంతకు చేరిన బాలుడు
ఆదిలాబాద్‌టౌన్: తప్పిపోయిన బాలుడిని బాలల సంరక్షణ అధికారులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఎనిమిదేళ్ల బాలుడు ఈనెల 13న ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో ఏడుస్తూ కనిపించడంతో రైల్వే సిబ్బంది బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. బాలుడు ఆకోల అని చెప్పడంతో మహారాష్ట్ర ప్రాంతంలో గాలించారు. సోషల్ మీడియా, దినపత్రికల్లో బాలుడు అదృశ్యమైనట్లు వార్తలు ప్రచురితం అయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన దంపతులు రవి, తమ కుమారుడని టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సోమవారం బాలుడిని ఐసీపీఎస్ అధికారుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, సభ్యులు దశరథ్, డేవిడ్, బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్, వినోద్, పద్మ, అశ్విని పాల్గొన్నారు.