
ఆదివాసీలకు హక్కుపత్రాలు ఇవ్వాలి
ఉట్నూర్‌రూరల్: ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతాత్ రాందాస్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పీవో ఖుష్బూ గుప్తాకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ధర్ము, ఎల్లయ్య, నర్సయ్య, చంద్రయ్య, శంకర్, సంధ్య, నంబాజీ, తదితరులు పాల్గొన్నారు.