
మంత్రి జూపల్లిని కలిసిన నేతలు
కైలాస్‌నగర్/తలమడుగు: ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఉమ్మడి జిల్లాకు చెందని కాంగ్రెస్ నేతలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, బోథ్ మాజీ ఎమ్మెల్యే బాపురావు, విజయ డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్, శ్యామ్ నాయక్ హైదరాబాద్‌లోని బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కలిశారు.
26, 27 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన
బాసర: ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్‌నగర్ కేంద్రాలలో స్పోర్ట్స్, ఎన్‌సీసీ, క్యాప్, పీహెచ్‌సీ కోటాల కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. 26న క్యాప్, పీహెచ్‌సీ, 27న స్పోర్ట్స్, ఎన్‌సీసీ, విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు బాసర క్యాంపస్ ఆవరణలో హాజరు కావాలని ఆయన సూచించారు. పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల తుది ఎంపిక జాబితా విడుదల చేయబడుతుందని వెల్లడించారు. జనరల్ కోటా అభ్యర్థుల తుది ఎంపిక జాబితా జూలై 4న విడుదల చేసి 7న మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కోకన్వీనర్ డాక్టర్ దేవరాజు, బండి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
దండేపల్లి: మండలంలోని నంబాల సమీపంలో ట్రాలీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం తెల్లవారు జామున పట్టుకున్నట్లు ఎస్సై తహసీనొద్దీన్ తెలిపారు. గ్రామానికి చెందిన మధుకర్‌పై కేసు నమోదు చేశామన్నారు. పట్టుకున్న సుమారు 7 క్వింటాళ్ల 70 కిలోల బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆర్‌ఐ మురళీకృష్ణకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.