
గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తిర్యాణి మండలం ఎర్రబండకు చెందిన గ్రామస్తులు పాఠశాల మంజూరు చేయాలని, గాదిగూడ మండలం చిత్తగూడ గ్రామస్తులు అంగన్‌వాడీ టీచర్‌ను నియమించాలని, తదితర సమస్యలపై 215 దరఖాస్తులు సమర్పించారు. ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలని డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో మెస్రం మనోహర్, డీడీ అంబాజీరావు, పీహెచ్‌వో సందీప్, ఏడీఎంఅండ్‌హెచ్‌వో మనోహర్, ఏవో దామోదర స్వామి, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం పాల్గొన్నారు.